Bengaluru Rains: అభిమానాన్ని పణంగా పెట్టిన మహిళ.. నిలిచిన ఐదు ప్రాణాలు..

Bengaluru Rains: భారతీయ సంప్రదాయం ప్రకారం చీర స్త్రీ హుందాతనానికి ప్రతి రూపం..చీరలోని గొప్పతనం తెలుసుకో..ఆ చీరకట్టి ఆడతనం పెంచుకో అంటూ చీర గొప్పతనాన్ని తెలుసుకో అంటూ ఓ సినీ కవి.

Update: 2023-05-23 07:42 GMT

Bengaluru Rains: అభిమానాన్ని పణంగా పెట్టిన మహిళ.. నిలిచిన ఐదు ప్రాణాలు..

Bengaluru Rains: భారతీయ సంప్రదాయం ప్రకారం చీర స్త్రీ హుందాతనానికి ప్రతి రూపం..చీరలోని గొప్పతనం తెలుసుకో..ఆ చీరకట్టి ఆడతనం పెంచుకో అంటూ చీర గొప్పతనాన్ని తెలుసుకో అంటూ ఓ సినీ కవి..ఒక మంచి పాట కూడా రాశాడు. ఇదంతా ఒకెత్తైతే ఓ మహిళ తన అభిమానాన్ని పణంగా పెట్టి ఐదుగురు ప్రాణాలను కాపాడింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాలకు అండర్ పాస్ లో పొంగిన నీటిలో ఓ కారు ఇరుక్కుపోయింది. ఆ సమయంలో కారులో ఆరుగురు ఉండగా అందులో భానురేఖ అనే మహిళ నీట మునిగి చనిపోయింది. మిగిలిన ఐదుగురిని బీబీఎంపీ రక్షణ బృందం కాపాడింది. అయితే, ఆ బృందం సంఘటనా స్థలానికి వచ్చేంతవరకు వారి ప్రాణాలను నిలిపింది మాత్రం ఓ చీర..ఔను, వర్షపు నీటితో మునిగిన కారులో ఇరుక్కునవారిని కాపాడేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు..ఆ విషయాన్ని అక్కడే ఉన్న మహిళ గమనించింది. మహిళతో పాటు చాలా మంది అక్కడ గుమ్మికూడారు. కారులో ఇరుక్కునవారిని కాపాడేందుకు తాడు లాంటిది ఇవ్వాలని ఆ వ్యక్తి అడగగా అక్కడ ఉన్న వారు చూస్తున్నారే తప్ప సహాయం చేసేందుకు ముందుకు రాలేదు.

పరిస్థితిని గమనించిన మహిళ వెంటనే తన ఒంటిపై ఉన్న చీరను విప్పి ఆ వ్యక్తికి అందించడమే కాకుండా మరో కొనను అండర్ పాస్ కు ఉన్న ఇనుప ఊచలకు కట్టింది. మహిళ చూపించిన సమయస్ఫూర్తి అక్కడి వారిలో మానవత్వాన్ని మేల్కొలిపింది. అక్కడే ఉన్న మరో మహిళ తన దుపట్టాను ఇవ్వగా మరో యువకుడు తన చొక్కాను విప్పి ఇచ్చాడు. అలావారు తమ వస్త్రాలనే తాడుగా చేసి కారులో ఇరుక్కున వారిని సురక్షితంగా కాపాడారు.

మొత్తంగా కళ్ల ముందు ప్రమాదం జరిగితే..ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం...చూసీచూడనట్లు వ్యవహరించడం నిత్యకృత్యమైన ఈ రోజుల్లో కళ్లెదుట జరుగుతున్న ప్రమాదం నుంచి కాపాడేందుకు తన అభిమానాన్ని పణ్ణంగా పెట్టిన మహిళ సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకుంటున్నారు. రక్షణ బృందం వచ్చి కాపాడుతుంది అని అనుకోకుండా..ఎంతో తెగువ చూపిన ఆ నారీమణికి అందరూ శిరస్సు వంచి నమస్కరించాలి..మొత్తంగా ఓ చీర ఐదుగురు ప్రాణాలను నిలిపింది. 

Tags:    

Similar News