Delhi Blast: ఢిల్లీ పేలుడు ఘటన వెనుక అనేక అనుమానాలు.. రంగంలోకి NIA

Update: 2024-10-20 09:57 GMT

Delhi Blast: ఢిల్లీలోని రోహిణి వద్ద ఉన్న సీఆర్పీఎఫ్ స్కూల్ బయట భారీ పేలుడు సంభవించిన ఘటన దేశ రాజధానిలో కలకలం సృష్టించింది. పేలుడు జరిగిన తీరు చూస్తోంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. షాక్ వేవ్స్ సృష్టించే విధంగా పేలుడు జరగడం వల్ల అక్కడ చుట్టూ ఉన్న భవనాలు, వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎయిర్, లిక్విడ్ రెండూ కలిపి ఒక గ్యాస్‌గా మార్చి దానిని వేడెక్కించి పేల్చడం ద్వారా ఇలాంటి షాక్ వేవ్స్ సృష్టించవచ్చని వార్తా కథనాలు చెబుతున్నాయి. పేలుడు ధాటికి సూపర్ సోనిక్ వేగంతో వ్యాపించిన ఈ షాక్ వేవ్స్ తగలడం వల్ల అక్కడి భవనాలు, వాహనాల అద్దాలు ధ్వంసమయ్యుంటాయని ప్రాథమిక అంచనాకు వస్తున్నారు.

ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులను, స్పెషల్ సెల్ బృందాన్ని పిలిపించారు. అలాగే యాంటీ-టెర్రర్ ఏజెన్సీ అయిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది.

ఘటనా స్థలంలో ఏదో కుళ్లిన దుర్వాసన వస్తుండటాన్ని, క్రూడ్ బాంబ్ తయారు చేయడానికి ఉపయోగించే కొన్ని పదార్థాలను ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్స్ గుర్తించారు. దీంతో ఈ పేలుడు కోసం వాడిన పదార్థాలలో ఎలాంటి రసాయనాలు ఉపయోగించారు అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ పేలుడు వెనుక ఏదైనా కుట్రకోణం లేకపోలేదని భావిస్తుండటం వల్లే ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. 

Tags:    

Similar News