Bengaluru rains: బెంగళూరులో భారీ వర్షాలు..భవనం కూలి ముగ్గురు దుర్మరణం
Bengaluru rains: కర్నాటక రాజధాని బెంగళూరు భారీ వర్షాలకు మరోసారి అతలాకుతలమైంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరోవైపు రికార్డు స్థాయిలో భారీ వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దక్షిణ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సహాయక చర్యలు చేపట్టారు.

బెంగళూరు నగరం భారీ వర్షాలకు తడిసిముద్దయ్యింది. అత్యంత భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.
మరో నలుగురిని సిబ్బంది రక్షించారు. హెన్నూరు సమీపంలోని బాబుస్ పాల్య ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 13 మంది కార్మికులు శిథిలాలలో చిక్కుకున్నారు. శిథిలాల మధ్య చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు ఫైర్ అండ్ రెస్య్కూ సర్వీసెస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ బెంగళూరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బెంగళూరు సిటీని భారీ వర్షం ముంచెత్తడంతో రహదారులపై నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. బెంగళూరులోని దక్షిణ ప్రాంతం మొత్తం కూడా నీటమునిగింది.
ఇళ్లలోకి నీరు వచ్చి చేరాయి. బాధితులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బూట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సిటీలోని పలు రహదారుల్లో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచింది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.