Corona Vaccine:రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే ప్రభుత్వం రూ.5000 ఇస్తోందా..?
Corona Vaccine:రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే ప్రభుత్వం రూ.5000 ఇస్తోందా..?
Corona Vaccine: దేశంలోని ప్రజలు కరోనా బారినపడకుండా ఉండడానికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కోట్లాది మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంకా చాలామంది తీసుకుంటున్నారు. అయితే కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి ప్రభుత్వం రూ.5000 ఇస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తవానికి ఒక వైరల్ మెస్సేజ్‌లో కరోనా వ్యాక్సిన్ పొందిన వ్యక్తులు ఒక ఫారమ్‌ను నింపాలి. ఆపై ప్రభుత్వం మీకు పూర్తి 5000 రూపాయలు ఇస్తుందని చెబుతున్నారు. ఈ మెస్సేజ్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై PIB వాస్తవ తనిఖీ చేసింది. అనంతరం అసలు నిజాన్ని ట్వీట్ చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ పొందిన వారికి ₹ 5,000 అందజేస్తున్నట్లు వస్తున్న సందేశంలో ఎటువంటి నిజం లేదని పీఐబీ తెలిపింది. ఈ మెస్సేజ్ నకిలీదని తేల్చింది. దయచేసి ఈ మెస్సేజ్‌ని ఎవ్వరూ ఫార్వార్డ్ చేయవద్దని సూచించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి మెస్సేజ్‌ల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని పీఐబీ పేర్కొంది. ఇలాంటి సందేశాలను ఫార్వార్డ్ చేయవద్దని ప్రజలను కోరింది. వీటివల్ల మీ వ్యక్తిగత సమాచారం, డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇలాంటి మెసేజ్‌లు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. మీకు ఎప్పుడైనా అలాంటి ఫేక్ మెసేజ్ వస్తే నిజానిజాలు తెలుసుకోవడానికి ఫ్యాక్ట్ చెక్ చేయండని సూచించింది.
एक वायरल मैसेज में दावा किया जा रहा है कि जिन लोगों ने कोविड वैक्सीन लगवा ली है उन्हें एक ऑनलाइन फॉर्म भरने के बाद प्रधानमंत्री जन कल्याण विभाग द्वारा ₹5,000 प्रदान किए जा रहे हैं #PIBFactcheck:▶️ इस मैसेज का दावा फर्जी है▶️ कृपया इस फर्जी मैसेज को फॉरवर्ड न करें pic.twitter.com/AV8asQzexu— PIB Fact Check (@PIBFactCheck) July 12, 2022