కరోనాకు మరో ఎమ్మెల్యే బలి..
కరోనా వైరస్ ప్రతాపానికి ప్రజాప్రతినిధులు సైతం తలవంచక తప్పడంలేదు..
కరోనా వైరస్ ప్రతాపానికి ప్రజాప్రతినిధులు సైతం తలవంచక తప్పడంలేదు.. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కరోనా భారిన పడ్డారు. ఒక తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే కూడా కరోనా కారణంగా మరణించారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ కరోనాకు బలయ్యారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఆయన ఫాల్టా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతనికి మే చివరలో కరోనా సోకింది. దాంతో చికిత్స కోసం కోల్‌కతాలోని ఓ ప్రవైట్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయనకు వేరే ఇతర ఆరోగ్య కారణాలు ఉండటం వలన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ కోల్‌కతా లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తమోనాష్ ఘోష్ మృతిపట్ల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలియజేశారు. 1998 నుండి ఫాల్టా ఎమ్మెల్యేగా పార్టీ కోశాధికారిగా తమోనాష్ ఘోష్ సేవలందించారు. ఆయన ఈ రోజు మమ్మల్ని విడిచిపెట్టడం చాలా బాధాకరం.. గత 35 సంవత్సరాలుగా మాతో ఉన్నారు, ప్రజల కోసం, పార్టీ కోసం అవిశ్రాంతంగా కృషిచేశారు. ఈ కష్టకాలంలో తన బాధ్యతను నిర్వర్తిస్తూ మరణించడం విచారకరం అని అని దీదీ పేర్కొన్నారు.