Train Blankets: రైళ్లలో దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు..రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం వైరల్

Update: 2024-11-28 07:07 GMT

Train Blankets: ఏసీ బోగీల్లో టిక్కెట్ రిజర్వ్ చేసుకుంటే రైల్వే శాఖ బెడ్ షిట్స్, దుప్పట్లను ప్రయాణికులకు అందిస్తుంది. అయితే ఈ దుప్పట్లను ఉతుకుతారా..ఉతికితే ఎన్నిరోజులకో సారి శుభ్రం చేస్తారన్న సందేహాలు ప్రయాణికుల్లో వ్యక్తమతుండటం సహజం. గతంలో అనేకు సందర్భాల్లో ఈ అంశంపై చర్చ జరిగింది. తాజాగా లోకసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి దీనిపై వివరణ ఇచ్చారు. రైల్వే మంత్రి ఏమన్నారంటే?

రైళ్లలో ప్రయాణించేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేక సౌకర్యాలు కల్పిస్తోంది రైల్వే శాఖ. ఏసీ బోగీల్లో టిక్కెట్ రిజర్వ్ చేసుకుంటే దుప్పట్లను కూడా అందిస్తారు. అయితే ఈ దుప్పట్ల శుభ్రత విషయంలో చాలా అనుమానాలు వ్యక్తమవుంటాయి. తాజాగా దీనిపై పార్లమెంట్ లో రైల్వే మంత్రిని ఓ ఎంపీ ప్రశ్న అడిగారు. నెలకు ఎన్నిసార్లు దుప్పట్లను శుభ్రం చేస్తారని అడిగారు. దీనికి మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు.

ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లను భారతీయ రైల్వే కనీసం నెలకు ఒక్కసారైనా ఉతుకుతుందని తెలిపారు. బెడ్ రోల్ కిట్ లో మెత్తని కవర్ గా ఉపయోగించేందుకు అదనపు షీట్ ను కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణీకుల వద్ద అదనం డబ్బులు వసూలు చేస్తోన్న రైల్వే నెలకు ఒకసారి మాత్రమే ఉన్ని దుప్పట్లను ఉతుకుతుందా అని కాంగ్రెస్ ఎంపీ కుల్దీప్ ఇండోరా ప్రశ్నించారు. దీనికి సమాధానంగా రైల్వే మంత్రి ఈ సమాధానం చెప్పారు.

భారతీయ రైల్వేలో ఉపయోగించే దుప్పట్లు తేలికగా, సులభంగా శుభ్రం చేయవచ్చని మంత్రి వివరించారు. ప్రయాణీకుల సౌకర్యం భద్రతను నిర్థారించడానికి రైల్వే తీసుకున్న ఇతర చర్యల గురించి కూడా తెలియజేశారు.

Tags:    

Similar News