మందుబాబులకి షాక్ ఇచ్చిన బెంగాల్ ప్రభుత్వం... ఒక్కరికి రెండు బాటిళ్ళు మాత్రమే!
లాక్ డౌన్ ని పొడిగిస్తూ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే..
లాక్ డౌన్ ని పొడిగిస్తూ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీనితో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో మద్యం షాపులు ఈ రోజు తెరుచుకున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హరియాణా, ఆంధ్రపదేశ్ మొదలగు రాష్ట్రాలలో మందుబాబులు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు.. కరోనా వ్యాప్తి చెందకుండా కనీస దూరం పాటించాలన్న నిబంధనను సైతం పక్కన పెట్టేశారు.
ఇక ఇది ఇలా ఉంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రారంభించడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో భాగంగా ఏ రిటైల్ షాపులోనైనా రెండు బాటిళ్ళకి మించి మద్యం ఏ వ్యక్తికి అమ్మకూడదని, ఇక దుకాణాలు కూడా మధ్యాహ్నం 12 నుండి 7 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని తమ ఉత్తర్వులో పేర్కొంది.. ఇక కంటైనర్ జోన్ల పరిధిలోకి వచ్చే ఏ దుకాణాలను తెరవడానికి వీలులేదని ఉత్తర్వులో పేర్కొంది. ప్రతి దుకాణం వద్ద వినియోగదారుల క్యూలో ఆరు అడుగుల దూరం ఉండేలని, ఐదుగురు వ్యక్తులను మించిఅనుమతించరాదని పేర్కొంది.
అంతేకాకుండా మద్యం దుకాణాల కౌంటర్లో ఎల్లప్పుడూ శానిటైజర్‌ను ఉంచాలని పేర్కొంది. ఇక మద్యం యొక్క MRP ధరలను బయట రాసి పెట్టాలని వెల్లడించింది. మరీ ముఖ్యంగా, మాస్క్ ధరించని ఏ వినియోగదారుడి కైనా మద్యం అమ్మవద్దని ప్రభుత్వం దుకాణాలను ఆదేశించింది. అన్ని సమయాల్లో ఈ నిబంధనలను పాటించాలని, లేనిచో చర్యలు తప్పవని పేర్కొంది.