Congress: రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా

Congress: హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం

Update: 2024-09-04 12:00 GMT

Congress: రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా

Congress: హరియాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పారీస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటుకు గురైన స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠ వీడింది. అందరి అంచనాలకు తగ్గట్టే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. ఆమె వెంట మరో రెజ్లర్ బజరంగ్ పునియా ఉన్నారు. వీరిద్దరు రాజకీయాల పట్ల తమకున్న ఆసక్తిని రాహుల్ గాంధీతో షేర్ చేసుకున్నారు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో వినేష్ ఫొగట్ హర్యాన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Tags:    

Similar News