ఉత్తరప్రదేశ్‌లో కూలిన హెలికాఫ్టర్.. పైలట్ మృతి

అజమ్‌గర్ జిల్లాలోని సరైమార్ ప్రాంతంలో సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో పైలెట్ మృతదేహాన్ని బురదలో పడివుండగా వెలికితీశారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం..

Update: 2020-09-21 12:17 GMT

ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గర్ జిల్లాలో సోమవారం 4 సీట్ల హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలట్ మరణించారు. ప్రమాదాన్ని ముందుగానే గమనించిన పైలట్ పారాచూట్‌తో దూకినా ప్రాణాలను కాపాడుకోలేకపోయాడు. పైలట్‌ను కోనార్క్ సరన్ గా గుర్తించారు. వాతావరణం అనుకూలించకపోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలోని సరైమార్ ప్రాంతంలో సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో పైలెట్ మృతదేహాన్ని బురదలో పడివుండగా వెలికితీశారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం,

ఉదయం 11:20 గంటలకు, ఒక హెలికాఫ్టర్ ఆకాశంలో అస్థిరంగా ఎగురుతూ కనిపించిందని.. కొద్దిసేపటికే పెద్ద శబ్దంతో అది పొలంలో పడిపోయిందని.. దగ్గరకు వెళ్లి చూస్తే పూర్తిగా ముక్కలుముక్కలుగా అయిందని అన్నారు. శకలాలకు 400 మీటర్ల దూరంలో పైలట్ మృతదేహం లభించింది. ప్రమాదం జరిగిన తరువాత జనం భారీగా గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా వచ్చారు. కాగా ఈ 4 సీట్ల హెలికాఫ్టర్ అమేథిలోని ఇందిరా గాంధీ నేషనల్ ఫ్లైట్ అకాడమీ నుండి ఫ్లై అయినట్టు అధికారులు గుర్తించారు.  

Tags:    

Similar News