కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన నటి ఊర్మిళ మటోండ్కర్ శివసేనలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే పీఏ మిలింద్ నవ్రేకర్‌తో ఊర్మిళ భేటీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. థాకరే పీఏతో ఊర్మిళ సమావేశం కావడం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తెరలేపింది. మరోవైపు తాను శివసేనలో చేరతాననే ప్రచారాన్ని ఊర్మిళ తోసిపుచ్చారు. కేవలం మర్యాదపూర్వకంగానే మిలింద్ నవ్రేకర్‌ను కలిశానని చెప్పుకొచ్చారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె అడుగులు ఎటు వైపనే ఆసక్తి నెలకొంది.