Amit Shah: మణిపూర్‌లో తాజా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి సమీక్ష

Amit Shah: ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్న హోంమంత్రి అమిత్ షా

Update: 2024-06-17 15:46 GMT

Amit Shah: మణిపూర్‌లో తాజా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి సమీక్ష

Amit Shah: మణిపూర్‌లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో సమావేశం జరిగింది. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ తపన్‌ దేకా, ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే, మణిపూర్‌ భద్రతా సలహారు కుల్దీప్‌ సింగ్‌, మణిపూర్‌ చీఫ్‌ సెక్రెటరీ వినీత్‌ జోషి, మణిపూర్‌ డీజీపీ రాజీవ్‌ సింగ్‌, అస్సాం రైఫిల్స్ డీజీ ప్రదీప్‌ చంద్రన్‌ నాయర్‌ ఈ సమావేశానికి హాజరైన వారిలో ఉన్నారు.

Tags:    

Similar News