కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్
జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య మరో ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య మరో ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని డేంజర్‌పోరా ప్రాంతంలో భద్రతా దళాలు శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ప్రాంతంలో భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్లు చేస్తుండగా, వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భారత దళాలు ఎన్‌కౌంటర్ ప్రారంభించడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోన్నట్టు తెలుస్తోంది.
ఇక అంతకుముందు ఏప్రిల్ 30 న , పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట చిన్న ఆయుధాలతో కాల్పులు , మోర్టార్లతో షెల్లింగ్ చేయడం ద్వారా పాకిస్తాన్ అప్రకటిత కాల్పుల విరమణ ఉల్లంఘనను ప్రారంభించింది. ఇదిలావుంటే కాశ్మీర్‌లోని యురి సెక్టార్‌లో నియంత్రణ రేఖపై కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ సైన్యం శుక్రవారం భారీ కాల్పులకు తెగబడింది. దాంతో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు.