Rahul Gandhi: నీట్ పేపర్ లీక్ తో విద్యార్థుల ఏళ్ల శ్రమ వృథా అయింది
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్ తో విద్యార్థుల ఏళ్ల శ్రమ వృథా అయిందన్న రాహుల్.. కోట్లాది మంది విద్యార్థుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయన్నారు. అలాంటి వారికి భరోసా ఇచ్చేందుకే పార్లమెంట్ లో నీట్ పై చర్చకు ప్రతిపాదించామన్నారు రాహుల్. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం చర్చకు అనుమతించడం లేదని విద్యార్థుల సమస్యపై చర్చించేందుకు ప్రధాని సిద్ధంగా లేరని అన్నారు.