Top 6 News @ 6PM: చిరు ఖాతాలో గిన్నిస్ రికార్డు.. తిరుపతి లడ్డూ వివాదంపై ప్రధానికి జగన్ లేఖ.. మరో టాప్ 4 న్యూస్ హెడ్‌లైన్స్

Update: 2024-09-22 12:35 GMT

1) ఇవాళ్టి అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా ప్రకటన

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝలిపిస్తోంది. ఇవాళ కూకట్‌పల్లి,అమీన్‌పూర్‌లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హైడ్రా..వాటి వివరాలను వెల్లడించింది. కూల్చివేతల ద్వారా.. కిష్టారెడ్డిపేటలో ఎకరం, పటేల్‌గూడలో మూడు ఎకరాలు, నల్ల చెరువు వద్ద నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటించింది.

2) తిరుమల లడ్డూ వివాదం లో దోషులకు శిక్ష పడాలి

తిరుమల లడ్డూ కల్తీ జరుగుతుంటే.. గత ఐదేళ్లు టీటీడీ బోర్డు ఏం చేసిందని ప్రశ్నించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్. లడ్డూ అపవిత్రం జరుగుతుంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఏం చేశారని నిలదీశారు. తప్పులు చేసిన వారిని జగన్‌ ఎలా సమర్థిస్తారని ఫైర్‌ అయ్యారు. కోట్లమంది స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులకు కఠిన శిక్ష పడాలని, లడ్డూ వివాదంపై కేబినెట్‌ భేటీలో, అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. అలాగే.. సీబీఐ దర్యాప్తుపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని కోరారు పవన్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై ఆయన ప్రాయశ్చిత్త దీక్షకు పూనారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీదశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవన్ దీక్ష చేపట్టారు. నేటి నుంచి 11రోజుల పాటు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగనుంది. దీక్ష ముగిసిన అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు పవన్.

3) తిరుపతి లడ్డూ వివాదంపై ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ

లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ లక్ష్యాల కోసం కోట్లమంది మనోభావాలు రెచ్చగొట్టే స్థాయికి దిగజారిపోయారని వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నారు. తిరుపతి లడ్డూల్లో కలుషితమైన నెయ్యి ఉపయోగించారు అని ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడు చేస్తోన్న తప్పుడు ఆరోపణలు వదంతులుగా మారుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతో పవిత్రమైన లడ్డూల పేరు చెప్పి ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు నాయుడు కప్పిపుచ్చుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు పెద్ద నేరం చేస్తున్నారన్న జగన్.. కొంతమంది చేస్తోన్న ఇలాంటి తప్పుడు ఆరోపణల వల్ల ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయాలకు ఉన్న ప్రతిష్ట మసకబారుతోందన్నారు. పూర్తి వార్తా కథనం కోసం

4) నా కుమారుడి కాలేజ్ ఫీజు కోసం అడుక్కోవాల్సి వచ్చిందన్న మాజీ డిప్యూటీ సీఎం

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో జైలుకి వెళ్లి, ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆప్ అగ్రనేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆ తరువాత తనకు ఎదురైన చేదు అనుభవాలను ఒక్కొక్కటిగా మీడియా ముందు వెల్లడించారు. తనని ఆప్ కన్వినర్ అయిన అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా మార్చేందుకు చాలా కుట్రలు జరిగాయన్నారు. అరవింద్ కేజ్రీవాల్ మీ పేరు చెప్పి ఇరికించారని, మీరు కూడా కేజ్రీవాల్ పేరు చెప్పాలని బలవంతం చేశారు. అలాంటి టెక్నిక్స్ ఉపయోగించి మా ఇద్దరి మధ్య వైరం పెంచడంతో పాటు నన్ను కేజ్రీవాల్‌కి వ్యతిరేక సాక్ష్యంగా మార్చేందుకు కుట్ర చేశారన్నారు. ఈ కేసులో కేజ్రీవాల్‌కి వ్యతిరేక వాంగ్మూలం ఇస్తే, మిమ్మల్ని వదిలేస్తాం అని నమ్మించేందుకు ప్లాన్ చేశారని మనీష్ సిసోడియా తెలిపారు. జనతా కా అదాలత్ పేరుతో తాజాగా జరిగిన పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో మనీష్ సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ అయిన తరువాత ఎదురైన ఆర్థిక ఇబ్బందుల గురించి మనీష్ సిసోడియా వెల్లడించారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) UNSCలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా మరోసారి మద్దతు..జోబైడెన్-మోదీ సమావేశం..కీలక అంశాలపై చర్చ

క్వాడ్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ-అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. అనేక కీలక అంశాలపై వీరిద్దరు చర్చించుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ తో సమావేశమయ్యారు. విల్మింగ్ టన్ లోని తన నివాసంలో జోబైడెన్ ఈ సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన రంగాల్లో భారత-అమెరికా దైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్యలు జరిపినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. ఇండో పసిఫిక్ ప్రాంతంతోపాటు అంతకుమించి ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం

గత 46 ఏళ్లుగా తెలుగు సినిమాను మకుటం లేని మహరాజుగా ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవిని ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. అయితే, తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు చిరంజీవిని మరో అరుదైన గౌరవంతో సన్మానించనున్నారు. దాదాపు 155 సినిమాల్లో నటించిన చిరంజీవి అన్ని సినిమాల్లోనూ డాన్సులు, ఫైట్స్ ఇరగదీశారు. అందుకే తెలుగు ఆడియెన్స్ చిరుని ఆదరించి మెగాస్టార్‌ని చేశారు. మెగాస్టార్‌ని తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారు కూడా గుర్తిస్తూ 537 పాటల్లో 24000 డాన్స్ మూమెంట్స్ చేసిన నటుడిగా వరల్డ్ రికార్డు అందించారు.

Tags:    

Similar News