Toll Booths: ఏడాదిలో దేశంలో టోల్ ప్లాజాలు మాయం: గడ్కరీ
Toll Booths: ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు మాయం కాబోతున్నాయి.
Toll Booths: ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు మాయం కాబోతున్నాయి. ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. లోక్‌సభ క్వశ్చన్ అవర్‌లో గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. వాహనానికి ఉన్న జీపీఎస్ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు తెలిపారాయన. ప్రస్తుతం దేశంలో 93 శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే టోల్ చెల్లిస్తున్నారని గడ్కరీ వివరించారు.