పుల్వామ జిల్లాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
పుల్వామ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది.
పుల్వామ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. కంగన్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైష్-ఇ-మొహమ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఈ ఉదయం కంగన్ ప్రాంతంలో వారి ఉనికిపై సమాచారం అందుకున్న తరువాత ప్రారంభించిన ఆపరేషన్లో ముగ్గురు జైష్-ఇ-మొహమ్మద్ ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ అయ్యారు. ప్రస్తుతం మరణించిన ఉగ్రవాదుల గుర్తింపును నిర్ధారిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం, భారత సైన్యం యొక్క 55 రాష్ట్రీయ రైఫిల్స్ మరియు సిఆర్పిఎఫ్ యొక్క 183 బెటాలియన్ అస్తాన్ మొహల్లాలో కార్డన్-అండ్-సెర్చ్-ఆపరేషన్ ను ప్రారంభించాయి. ఈ క్రమంలో " ఈ ప్రాంతంలో జైష్-ఎ-ముహమ్మద్ ఉగ్రవాద సంస్థ సభ్యులు ఉన్నట్లు మాకు సమాచారం ఉంది, అందుకే ఆపరేషన్ జరిగింది" అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
నివేదికల ప్రకారం, బుధవారం ఉదయం భద్రతా దళాలు ఆ స్థలాన్ని చుట్టుముట్టాయి. వెంటనే ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపి నలుగురిని అంతమొందించాయి. చనిపోయిన వారిలో ఒకరు జైష్ కమాండర్ అని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా పుల్వామాలో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.
HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి