Union Budget 2024: నేడే కేంద్ర బడ్జెట్..ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్..7వ బడ్జెట్ పై అంచనాలు ఇవే

Union Budget 2024: నేడు ఉదయం 11గంటలకు లోకసభలో సాధారణ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో కొత్త పెన్షన్ సిస్టమ్, ఆయుష్మాన్ భారత్ వంటి సామాజిక భద్రత సంబంధిత పథకాలకు సంబంధించి కొన్ని ప్రకటనలు ఉండవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

Update: 2024-07-23 02:08 GMT

Union Budget 2024: నేడే కేంద్ర బడ్జెట్..ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్..7వ బడ్జెట్ పై అంచనాలు ఇవే

Union Budget 2024:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నేటి బడ్జెట్‌లో రైతులకు ఉపశమనం, ఉద్యోగస్తులకు ఆదాయపు పన్ను మినహాయింపు, వ్యాపారులకు రాయితీలు, పిఎల్‌ఐ పథకం పరిధిని విస్తరించడం మొదలైనవాటిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బడ్జెట్‌లో ఎలాంటి కీలక ప్రకటనలు చేస్తారో తెలుసుకుందాం.

ఆరోగ్య రంగానికి:

ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు భారీగా పెరిగే అవకాశం ఉంది. నేషనల్ హెల్త్ మిషన్, నేషనల్ హెల్త్ అథారిటీ, ఎయిమ్స్ హాస్పిటల్ కోసం బడ్జెట్ కేటాయింపు ఉంటుందని భావిస్తున్నారు.

ఉపాధి కల్పనపై దృష్టి:

బడ్జెట్‌లో ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులకు పన్ను మినహాయింపు ప్రకటించే అవకాశం ఉంది.వ్యవసాయం, స్టార్టప్‌లు, గృహనిర్మాణం, రైల్వేలు, రక్షణ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనంపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. బడ్జెట్‌లో ఎన్‌పిఎస్, ఆయుష్మాన్ భారత్‌పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. పింఛన్‌ పథకాలపై రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో... ఎన్‌పీఎస్ (న్యూ పెన్షన్ సిస్టమ్)పై భారీగానే ఆశలు ఉన్నాయి.

MSME:

దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (MSME) ప్రోత్సహించడానికి, రాబోయే బడ్జెట్‌లో ముద్రా యోజన కింద రుణ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచే ప్రకటనరావచ్చు. ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) కింద రుణ పరిమితిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచే అవకాశం ఉంది. MSMEల కోసం అన్‌సెక్యూర్డ్‌గా పరిగణించబడే రుణాల క్రెడిట్ గ్యారెంటీ కవర్‌ను రూ. 2 కోట్ల నుండి రూ. 5 కోట్లకు పెంచే అవకాశం ఉంది.

గ్రామీణ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులపై దృష్టి :

గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థను పెంపొందించేందుకు బడ్జెట్‌లో పెట్టుబడుల పెంపుదలని ఆర్థిక మంత్రి ప్రకటించవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీని వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కూడా లాభపడనుంది.

ఆయుష్మాన్ భారత్ పై ప్రకటనలు:

కొత్త పెన్షన్ సిస్టమ్, ఆయుష్మాన్ భారత్ వంటి సామాజిక భద్రత సంబంధిత పథకాలకు సంబంధించి సాధారణ బడ్జెట్‌లో కొన్ని ప్రకటనలు ఉండవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ, 70 ఏళ్లు పైబడిన పౌరులందరికీ 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స కోసం ఆయుష్మాన్ పథకం పరిధిలోకి తీసుకువస్తామని ప్రధాని మోదీ చెప్పారు.

ప్రభుత్వం రక్షణ వ్యయం:

భారతదేశ రక్షణ బడ్జెట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను తీర్చగలదని భావిస్తున్నారు. అందువల్ల రక్షణ బడ్జెట్‌ను పెంచాల్సిన అవసరం ఉంది. చైనా, పాకిస్థాన్‌ల నుంచి భారత్‌కు పొంచి ఉన్న ముప్పుతో సహా ప్రస్తుత భౌగోళిక రాజకీయ దృష్టాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటే, రాబోయే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయంలో కనీసం 25 శాతాన్ని భారత్ వెచ్చించాలని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.

రైల్వే ప్రయాణికుల భద్రతపై దృష్టి:

2024-25 ఆర్థిక సంవత్సరానికి రాబోయే యూనియన్ బడ్జెట్‌లో, రైల్వే నెట్‌వర్క్‌లో ప్రయాణీకుల సామర్థ్యాన్ని, భద్రతను పెంచడంపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. నెట్‌వర్క్‌ను విస్తరించడం, రద్దీని తగ్గించడం, కార్యాచరణ ప్రమాదాలను నివారించడం ద్వారా సాధారణ ప్రజలకు మరిన్ని సౌకర్యాలను సృష్టించడానికి, రైలు సామర్థ్యాన్ని పెంచడానికి తగిన నిధులను కేటాయించడాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో నేషనల్ ట్రాన్స్‌పోర్టర్ 10,000 నాన్-ఏసీ కోచ్‌లను తయారు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News