వారికి శుభ‌వార్త‌.. రూ.3,274 కోట్లు విడుదల చేసిన మోదీ ప్ర‌భుత్వం..

Modi Government:హోలి పండుగ ముంద‌ర కేంద్ర ప్ర‌భుత్వం త‌న ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కి డీఏ అల‌వెన్స్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2022-03-08 16:30 GMT

వారికి శుభ‌వార్త‌.. రూ.3,274 కోట్లు విడుదల చేసిన మోదీ ప్ర‌భుత్వం..

Modi Government:హోలి పండుగ ముంద‌ర కేంద్ర ప్ర‌భుత్వం త‌న ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కి డీఏ అల‌వెన్స్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా స్వాతంత్య్ర సమరయోధులకు కూడా శుభ‌వార్త చెప్పింది. అర్హులైన ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ కుటుంబాల‌కి పెద్ద కానుక అందించింది. సైనిక్ సమ్మాన్ యోజన (SSSY) కాలపరిమితిని పొడిగించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్వాతంత్య్ర సమరయోధులకు ఎంతో ఊరటనిస్తుంది.

నిజానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజనను వచ్చే నాలుగేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.3,274.87 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద, 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు స్వాతంత్ర్య సమరయోధులు, వారిపై ఆధారపడిన కుటుంబాల‌కు పెన్షన్, డియర్‌నెస్ రిలీఫ్ (DR) ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందిస్తుంది.

ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 23,566 మంది లబ్ధి పొందుతారు. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో 'స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజన దాని భాగాలను 2021-22 నుంచి 2025-26 వరకు మొత్తం రూ. 3,274.87 కోట్ల ఆర్థిక వ్యయంతో ఆమోదించింది. స్వాతంత్య్ర సమరయోధులకు ప్రయోజనాలను అందించే ఈ ప్రత్యేక పథకాన్ని SSSY కొనసాగించాలనే ప్రతిపాదనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. పింఛను మొత్తాన్ని కూడా కాలానుగుణంగా సవరిస్తూ ఆగస్టు 15, 2016 నుంచి డియర్‌నెస్ రిలీఫ్ ఇస్తున్నారు. హోలీకి ముందే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించి లబ్ధిదారులందరికీ శుభవార్త అందించింది.

Tags:    

Similar News