Modi Gifts: ప్రధాని మోదీ అందుకున్న బహుమతులు నేటి నుంచే వేలం

Modi Gifts: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందుకున్న 600లకు పైగా బహుమతులు నేడు వేలం వేయనున్నారు. పారాలింపిక్ పతక విజేతలకు చెందిన వస్తువులు , స్పోర్ట్స్ షూ, ఇతర వస్తువుల నుండి రామ రామమందిరం ప్రతిరూపం, వెండి వీణ ఇలా ప్రధాని మోదీ ఏడాది కాలంలో అందుకున్న బహుమతుల వేలం నేటి నుంచి మొదలై అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది.

Update: 2024-09-17 03:14 GMT

Modi Gifts: ప్రధాని మోదీ అందుకున్న బహుమతులు నేటి నుంచే వేలం

Modi Gifts: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అందిన 600కు పైగా బహుమతుల వేలం మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ వేలం మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. పారాలింపిక్ పతక విజేత వస్తువులు, స్పోర్ట్స్ షూస్, రామమందిరం ప్రతిరూపం, వెండి వీణ వరకు, అవి వేలం వేయనున్నారు. వేలానికి పెట్టనున్న ఈ వస్తువుల మొత్తం బేస్ ధర రూ.1.5 కోట్లు ఉంటుందని సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం తెలిపారు.

ధర రూ. 600 నుంచి రూ. 8.26 లక్షలు:

ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో ప్రధాని అందుకున్న మెమెంటోలను ప్రదర్శించే ప్రదర్శనను షెకావత్ సందర్శించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ బహుమతులను వేలం వేయడానికి ప్రభుత్వ కమిటీ బేస్ ధర నిర్ణయిస్తుందని, వీటి ధరలు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.8.26 లక్షల వరకు ఉంటాయన్నారు. సాంస్కృతిక మంత్రి మాట్లాడుతూ, 'మన ప్రధాని తనకు వచ్చిన బహుమతులు, సావనీర్‌లను వేలం వేసే కొత్త సంస్కృతిని ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసేవారని తెలిపారు.

'ఈ తరహా వేలం ఆరోసారి నిర్వహిస్తున్నారు'

ప్రధాని మోదీకి లభించే కానుకలను వేలం ద్వారా తిరిగి ప్రజలకు అందజేస్తామని, వేలం ద్వారా వచ్చిన సొమ్మును గంగానది ప్రక్షాళనకు వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు . ఇలాంటి వేలం ఆరోసారి నిర్వహిస్తున్నామని, దీని ద్వారా వచ్చే నిధులను జాతీయ గంగా నిధికి విరాళంగా అందజేస్తామని షెకావత్ తెలిపారు. గత ఏడాది కాలంలో ప్రధాని మోదీకి బహుమతులుగా వచ్చిన 600 వస్తువులను ఈసారి వేలం వేయనున్నారు. pmmementos.gov.inని సందర్శించడం ద్వారా ఈ బహుమతులను కొనుగోలు చేయవచ్చు.


పారాలింపిక్ కాంస్య పతక విజేత నిత్య శ్రీ శివన్, సుకాంత్ కదమ్‌ల బ్యాడ్మింటన్ రాకెట్లు, రజత పతక విజేత యోగేష్ ఖతునియా 'డిస్కస్' బేస్ ధర అత్యధికంగా ఉంచబడిన వస్తువులలో ఉన్నాయి. వాటి మూల ధర దాదాపు రూ.5.50 లక్షలుగా నిర్ణయించారు. పారాలింపిక్‌లో కాంస్య పతక విజేతలు అజిత్ సింగ్, సిమ్రాన్ శర్మ, రజత పతక విజేత నిషాద్ కుమార్‌లు బహుమతిగా ఇచ్చిన షూస్‌తో పాటు రజత పతక విజేత శరద్ కుమార్ సంతకం చేసిన క్యాప్ బేస్ ధర రూ.2.86 లక్షలుగా ఉంది.

రూ.5.50 లక్షల విలువైన రామాలయం ప్రతిరూపం, రూ. 3.30 లక్షల విలువైన నెమలి విగ్రహం, రూ. 2.76 లక్షల విలువైన రామ్ దర్బార్ విగ్రహం, రూ. 1.65 లక్షల విలువైన వెండి వీణ, ఇతరత్రా అధిక బేస్ ధరలు ఉన్నాయి. కాటన్ అంగవస్త్రం, టోపీ, శాలువతో కూడిన అత్యల్ప బేస్ ప్రైస్ బహుమతులు రూ.600. ప్రధాని మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17న వేలం ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తుంది.

Tags:    

Similar News