ఢిల్లీలో రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు

Update: 2020-12-30 10:05 GMT

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనపై కేంద్రం మరోసారి రైతు సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. ఇప్పటి వరకు ఐదు దఫాలుగా చర్చించినప్పటికీ రైతుల ఆందోళన కొలిక్కి రాకపోవడంతో ఇవాళ మరోసారి సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్‌, పీయూష్‌ గోయల్‌ నేతృత్వంలో జరుగుతున్న ఈ చర్చల్లో 40 రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాల రద్దే ప్రధాన అజెండాగా చర్చ కొనసాగుతోంది. ఇవాళ్టి చర్చలతో రైతుల నిరసనలు ముగుస్తాయని కేంద్ర మంత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు చట్టాల వలన తీవ్ర అన్యాయం జరుగుతుందని విద్యుత్ బిల్లు వలన రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయని ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్షన్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ తెలిపింది. 2020 ఈ ఏడాది సెప్టెంబర్ లో పార్లమెంట్ ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. మరో వైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 36వ రోజు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీ సరిహద్దులోని తిక్ర, సింఘ, ఘజీపూర్ లో రైతులు బైఠాయించారు.

Tags:    

Similar News