Viral News: మా అత్త త్వరగా చనిపోవాలి.. దేవుడి హుండీలో ప్రత్యక్షమైన నోటు.. అంతా షాక్
Mother in law should die: దేవుడి హుండీలో డబ్బులు లెక్కిద్దామని తెరిచిన ఆలయ అధికారులకు అందులో ఓ నోటు కనిపించింది. అందులో తమ కోరికను రాసి వేశారు. ఆ నోటుపై ఉన్నది చదివి అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
దేవుడు దగ్గర చాలా మంది కోరికలు కోరుకుని..ఆ కోరికలను మనసులోనే ఉంచుకుంటారు. అయితే కొంతమంది తమ కోరికలను పేపరుపై రాసి హుండీల్లో వేస్తుంటారు. కానీ కర్నాటకలోని కలబురిగి ప్రాంతంలో ఓ భక్తుడో , భక్తురాలూ తెలియదు కానీ నోటు మీద తమ కోరికను రాసి హుండీలో వేశారు. అత్తగారు త్వరలో చనిపోవాలని దేవుడిని కోరుకున్నారు. ఇదే విషయాన్ని నోటు మీదు రాశారు. ఆలయ అధికారులు ఆ నోటును ఫొటో తీయడంతో ఇప్పుడు వైరల్ గా మారింది.
కలబురిగి సమీపంలో ఆఫ్జర్ పూర్ తాలుకూాలో గట్టారంగి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో భాగ్యవంతిదేవి ఆలయం ఉంది. ఆ గ్రామం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఆ ఆలయానికి వస్తుంటారు. ఈమధ్యే ఆ హుండీ తెరిచిన అధికారులు డబ్బులు లెక్కిస్తున్న సమయంలో 20రూపాయల నోటి కాస్త డిఫరెంట్ గా కనిపించింది. ఆ నోటు ఏంటా అని తీసి చూశారు. దాని వెనక దేవుడా నా అత్త తొందరగా చనిపోవాలని రాసి ఉంది.
ఆలయ అధికారులు ఈ 20 రూపాయల నోటు ఫోటో తీసిన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎక్కువ మంది పాపం ఆ అల్లుడు లేకపోతే ఆ కోడలు ఆ అత్త నుంచి ఎంత టార్చర్ అనుభవిస్తున్నారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది దేవుడిని ప్రాణాలు తీయమని కోరడం విచిత్రం ఉందంటున్నారు. మొత్తానికి ఈ నోటు ఎవరు రాశారో కానీ..వారి కోరిక తీరాలా వద్దా అనేదానిపై అనేక చర్చలు మాత్రం జరుగుతున్నాయి.