Dr.Manmohan Singh: రూ. 700 అద్దె ఇంటిలో, జిన్నాను తాకిన మన్మోహన్ షాట్

మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అసోంలో రూ. 700లకు అద్దెకు ఇల్లు తీసుకున్నారు. ప్రధానిగా కొనసాగిన సమయంలో కూడా ఈ ఇంటికి అద్దె పంపారు.

Update: 2024-12-27 15:00 GMT

Dr.Manmohan Singh: రూ. 700 ఇంటి అద్దెలో మన్మోహన్ సింగ్, జిన్నాను తాకిన మన్మోహన్ షాట్

Manmohan Singhs 2 BHK House In Guwahati, How He Remained A Diligent Tenant

మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అసోంలో రూ. 700లకు అద్దెకు ఇల్లు తీసుకున్నారు. ప్రధానిగా కొనసాగిన సమయంలో కూడా ఈ ఇంటికి అద్దె పంపారు. 2019 వరకు ఆయన ఇంటి అద్దెను ఇచ్చారు.1991లో పీవీ నరసింహారావు కేబినెట్ లో మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా పనిచేశారు. ఆయన అసోం నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 1991లో అసోం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో అసోంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

హితేశ్వర్ సైకియా సీఎం. మన్మోహన్ సింగ్ అసోం నుంచి రాజ్యసభ నుంచి నామినేట్ కావడం కొందరికి నచ్చలేదు. దీంతో కొందరు దీనిపై కోర్టులో సవాల్ చేశారు. ఈ సమయంలో గువాహాటిలోని సరుమ్‌త్రియాకు చెందిన నందన్‌నగర్ ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మన్మోహన్ సింగ్ అద్దెకు తీసుకున్నారు.

ఈ ఇల్లు అసోం సీఎం హితేశ్వర్ సైకియా ఇల్లు. మన్మోహన్ సింగ్ ఆయన భార్య దిల్లీ నుంచి అసోంలోని ఇదే ఇంటి చిరునామా మీద ఓటర్ గుర్తింపు కార్డులు తీసుకున్నారు. సైకియా మరణించిన తర్వాత కూడా ఇదే ఇంటితో ఆయన అనుబంధం కొనసాగింది. 2004లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు కూడా ఇదే అడ్రస్ ను కొనసాగించారు.ప్రతి నెల మన్మోహన్ సింగ్ ఇంటి అద్దెను చెల్లించారు.

మలేషియా ప్రధాని పిల్లలకు ట్యూషన్ ఫీజు ఆఫర్ చేసిన మన్మోహన్

మలేషియా ప్రధాని అన్వర్ అబ్రహం (Anwar Ibrahim) ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయన పిల్లలకు ట్యూషన్ ఫీజును ఆఫర్ చేశారు. ఈ ఆఫర్ ను అన్వర్ తిరస్కరించారు. మన్మోహన్ సింగ్ మరణించిన విషయం తెలిసి ఆయన గురించి మలేషియా ప్రధాని గతంలో మన్మోహన్ సింగ్ తో తనకున్న అనుబంధాన్ని ఆయన సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు. 1998లో మలేషియా ఆర్ధిక మంత్రిగా ఉన్న అన్వర్ అబ్రహం చిక్కుల్లో పడ్డారు.


మలేషియా కేబినెట్ నుంచి ఆయనను తొలగించారు. అవినీతి ఆరోపణలతో ఆయనను జైల్లో పెట్టారు. తమ కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని తెలుసుకున్న మన్మోహన్ సింగ్ ఆర్ధిక సహాయం చేస్తామని ఆఫర్ ఇచ్చారు. తన పిల్లలకు స్కాలర్ షిప్ ఇస్తామని సమాచారం పంపారు. ఈ ఆఫర్ ను తాను సున్నితంగా తిరస్కరించినట్టుగా ఆయన చెప్పారు. గుడ్ బై మై మిత్రా, మై భాయ్, మన్మోహన్ అంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు.

10 గంటల ఆపరేషన్ తర్వాత దేశం గురించి మన్మోహన్ ఏమన్నారంటే?

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2009 లో ఆయనకు ఆపరేషన్ జరిగింది. 10 గంటలకు పైగా వైద్యులు గుండెకు సంబంధించి ఆపరేషన్ జరిగింది. శ్వాస తీసుకోవడానికి పైప్ ను వైద్యులు అమర్చారు. ఈ సర్జరీ పూర్తైన తర్వాత దేశం గురించి ఆయన వైద్యులను అడిగారు. దేశం ఎలా ఉంది, కాశ్మీర్ ఎలా ఉంది, సర్జరీ గురించి ఎలాంటి బెంగ లేదన్నారు.

జిన్నాను తాకిన మన్మోహన్ షాట్

మన్మోహన్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ లో జన్మించారు. ఆయనకు హకీ అంటే ఇష్టం. ఆయనకు 13 ఏళ్ల వయస్సుకన్న సమయంలో లాహోర్ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో హకీ ఆడారు. ఈ ఆటను మహమ్మద్ అలీ జిన్నా చూస్తున్నారు. మన్మోహన్ సింగ్ కొట్టిన గోల్ జిన్నా తలను తాకింది. అయితే చిన్నపిల్లలు కావడంతో జిన్నా నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని మన్మోహన్ సింగ్ మీడియాకువివరించారు.

Tags:    

Similar News