Top 6 News @ 6PM: "ఆస్తి కొట్టేసేందుకు చెక్కపెట్టెలో డెడ్ బాడీ": మరో 5 ముఖ్యాంశాలు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్ధివదేహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నివాళులర్పించారు.

Update: 2024-12-27 12:40 GMT

Top 6 News @ 6PM: "ఆస్తి కొట్టేసేందుకు చెక్కపెట్టెలో డెడ్ బాడీ": మరో 5 ముఖ్యాంశాలు

1. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్రపతి,ప్రధాని నివాళి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్ధివదేహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నివాళులర్పించారు. అనారోగ్య కారణాలతో మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26 రాత్రి 9.51 గంటలకు అనారోగ్యంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారధిగా మన్మోహన్ సింగ్ దేశం గుర్తుంచుకుంటుందని ఆర్ బీ ఐ గవర్నర్ సహా కీలక పదవుల్లో దేశానికి సేవలు అందించిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

2. అడ్లూరు చెరువులో ముగ్గురి మృతదేహలు, మిస్టరీ మరణాలపై కొనసాగుతున్న దర్యాప్తు

కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు ఎస్ ఐ సాతెల్లి సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్ కమ్మరి శ్రుతి, బీబీపేటకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్ తోట నిఖిల్ అనుమానాస్పదస్థితిలో మరణించారు. డిసెంబర్ 25 సాయంత్రం శ్రుతి, నిఖిల్ మృతదేహలు అర్ధరాత్రి వేళ సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్దచెరువులో లభించాయి. గురువారం ఉదయం సాయికుమార్ మృతదేహాన్ని కూడా చెరువులో కనుగొన్నారు. ముగ్గురి మృతి కారణాలను తెలుసుకునేందుకు కాల్ డేటాను, వాట్సాప్ చాటింగ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గురు వారం రోజుల నుంచి చాలా సార్లు గంటల సమయం ఫోన్లలో మాట్లాడుకున్నారని గుర్తించారు.

3. ఆస్తి కొట్టేసేందుకు చెక్కపెట్టెలో డెడ్ బాడీ: ఎస్పీ నయీం అస్మీ

పశ్చిమగోదావరి జిల్లాలో చెక్కపెట్టెలో మృతదేహం కేసు దర్యాప్తు పూర్తైందని ఎస్పీ నయీం ఆస్మీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. శ్రీధర్ వర్మ, అతని రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మ పాత్ర ఉందని తేల్చామని ఆయన చెప్పారు. ఈ నెల 19న పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలోని సంఘటనాస్థలానికి వెళ్లి దర్యాప్తు చేశామన్నారు. రంగరాజు కూతుళ్లు తులసి, రేవతి మధ్య గొడవలున్నాయి. రేవతికి 2016లో శ్రీధర్ వర్మతో పెళ్లి జరిగింది. తులసిని భర్త వదిలేయడంతో పుట్టింట్లో ఉంటుంది. రంగరాజుకు 2.5 ఎకరాల పొలం, స్థలం, బంగారం ఉంది. రంగరాజు ఆస్తి కోసం కుట్ర పన్నారని ఎస్పీ చెప్పారు. డెడ్ బాడీతో తులసిని భయపెట్టి ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేశారని ఆయన తెలిపారు.

4. జర్మనీ పార్లమెంట్ రద్దు

జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ (Frank-Walter) శుక్రవారం పార్లమెంట్ ను రద్దు చేశారు. 2025 ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ కు తాత్కాలిక ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.733 మంది సభ్యులున్న సభలో ఓటింగ్ జరిగింది. 733 మంది సభ్యులున్న సభలో ఓటింగ్ జరిగితే ఆయనకు అనుకూలంగా 207 ఓట్లే వచ్చాయి. వ్యతిరేకంగా 394 మంది ఓటేశారు.116 మంది గైర్హాజరయ్యారు.

5. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణను 2025 జనవరి 10కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉంది. కానీ, వర్చువల్ గా హాజరయ్యేందుకు కోర్టును అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనికి కోర్టు అనుమతించింది.అల్లు అర్జున్ విచారణకు వర్చువల్ గా హాజరయ్యారు.

6. అస్ట్రేలియా, ఇండియా టెస్ట్ మ్యాచ్: తడబడిన భారత బ్యాట్ మెన్స్

బాక్సింగ్ డే టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. పాలో ఆన్ గండం నుంచి బయటపడాలంటే వందకు పైగా పరుగులు చేయాలి. ఇప్పటికే భారత్ సగం వికెట్లు కోల్పోయింది. ఆసీష్ బ్యాటర్లు భారత బౌలర్లపై విజృంభించారు. కానీ,భారత బ్యాటర్లు మాత్రం రాణించలేదు. వరుసగా పెవిలియన్ బాట పట్టారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడు పరుగులకే ఔటయ్యారు. కేఎల్ రాహుల్ కొద్దిసేపు క్రీజ్ లో కుదురుకున్నారు. యశస్వి జైపాల్ ఆచితూచి ఆడారు. ఆ తర్వాత బ్యాట్ తో పరుగుల వరద పారించారు. టెస్టులో హాఫ్ సెంచరీ చేశారు.ఆసీస్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 474 పరుగులు చేసి అలౌటైంది. టీమ్ ఇండియా 310 పరుగులు వెనుకంజలో ఉంది. ఫాలో ఆన్ ను తప్పించుకోవాలంటే మరో 111 పరుగులు చేయాలి.

Tags:    

Similar News