Top 6 News @ 6PM: పవన్ కళ్యాణ్ టూర్ లో నకిలీ ఐపీఎస్ అధికారిపై కేసు: మరో 5 ముఖ్యాంశాలు

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఐపీఎస్(IPS) అధికారినంటూ సూర్యప్రకాష్ (Surya Prakash) అనే వ్యక్తి టూర్ లో హల్ చల్ చేశారు.

Update: 2024-12-28 12:39 GMT

Top 6 News @ 6PM: పవన్ కళ్యాణ్ టూర్ లో నకిలీ ఐపీఎస్ అధికారిపై కేసు: మరో 5 ముఖ్యాంశాలు

1.పవన్ కళ్యాణ్ టూర్ లో నకిలీ ఐపీఎస్ అధికారి: సూర్యప్రకాష్ పై కేసు

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఐపీఎస్(IPS) అధికారినంటూ సూర్యప్రకాష్ (Surya Prakash) అనే వ్యక్తి టూర్ లో హల్ చల్ చేశారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సూర్యప్రకాష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

పవన్ వెంట ఆయన ఎందుకు వచ్చారనే విషయమై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసిన తర్వాత విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూర్యప్రకాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సూర్యప్రకాష్ గత ఏడాది తాను ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యాయని స్థానికులకు చెప్పారని సమాచారం.

ట్రైనింగ్ లో భాగంగానే పవన్ కళ్యాణ్ టూర్ కు వచ్చానని ఆయన చెబుతున్నట్టుగా తెలుస్తోంది. సూర్యప్రకాష్ గతంలో పార్వతీపురం డివిజన్ లోన తూనికలు, కొలతల విభాగంలో పనిచేశారని పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 20న పార్వతీపురం మన్యం జిల్లాలో(parvathipuram manyam district) పవన్ కళ్యాణ్ పర్యటించారు. పవన్ కళ్యాణ్ పార్వతీపురం పర్యటనలో భద్రత లోపంపై హోంశాఖ మంత్రి అనిత విచారణకు ఆదేశించారు. వై కేటగిరి భద్రత కలిగిన పవన్ కళ్యాణ్ వెంట నకిలీ ఓ వ్యక్తి ఐపీఎస్ అధికారినంటూ ఎలా వచ్చారో సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు. మరో వైపు ఈ ఘటనపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు.ఇది భద్రతాపరమైన లోటు కాదని ఆయన అన్నారు.

2. పార్ములా ఈ కారు రేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు, కీలక ఫైళ్లు స్వాధీనం

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు పంపారు. 2025 జనవరి 7న విచారణకు రావాలని ఆ నోటీసులో కోరారు. జనవరి 2న ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్, జనవరి 3న హెచ్ఎండీఏ రిటైర్డ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి నోటీసులు పంపారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని, ఫైళ్లను ఈడీ అధికారులకు ఏసీబీ శనివారం అందించింది. ఈ నెల 19న ఫార్మూలా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్,బీఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదైంది.ఈ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. డిసెంబర్ 20న ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో డిసెంబర్ 31 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టులో కేటీఆర్ కు ఊరట దక్కింది.

3. పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డ్:సూర్యుడికి సమీపానికి వెళ్లి తిరిగొచ్చిన వ్యోమనౌక

సూర్యుడికి అత్యంత దగ్గరకు వెళ్లి సురక్షితంగా పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక వెలుపలికి వచ్చింది. 2018లో ఈ వ్యోమనౌకను నాసా ప్రయోగించిది. అంతరిక్ష వాతావరణం, సౌర తుఫాన్లు, సౌర జ్వాలల గురించి తెలుసుకునేందుకు దీన్ని ప్రయోగించారు. సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత 6 వేల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. భానుడి వెలుపలి వాతావరణమైన కరోనా ఉష్ణోగ్రత 40 లక్ల డిగ్రీల సెల్సిస్ వరకు ఉంటుంది. దీన్ని రహస్యం తెలుసుకోవడానికి ప్రోబ్ ను పంపారు. ఇంతటి తీవ్రమైన ఉష్ణోగ్రతను తట్టుకునేలా 11.5 సెంటీమీటర్ల కార్బన్ కాంపోజిట్ కవచాన్ని ప్రోబ్ కు ఏర్పాటు చేశారు.

4. అన్నా యూనివర్శిటీలో లైంగిక దాడికి గురైన బాధితురాలికి రూ. 25 లక్షల పరిహారం

అన్నా యూనివర్శిటీ ప్రాంగణంలో విద్యార్ధినిప అత్యాచారానికి ఇద్దరు దుండగులు పాల్పడ్డారు.బాధితురాలికి ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం అందించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ ఘటనపై విచారించేందుకు ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో సిట్ ను ఏర్పాటు చేయాలని కోర్టు కోరింది. బాధితురాలి చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని కూడా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.బాధితురాలి నుంచి ఫీజు కూడా వసూలు చేయవద్దని కోరింది.ఈ నెల 23న తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో బాధితురాలి స్నేహితుడిపై దాడి చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

5. ఐదు నెలల్లో 200 ఎకరాలను రక్షించాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

ఐదు నెలల్లో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించినట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. 12 చెరువులు, 8 పార్కులను అన్యాక్రాంతం కాకుండా కాపాడామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.105 చెరువులకు సంబంధించి ఎఫ్ టీ ఎల్ ను వచ్చే ఏడాది నిర్ధారిస్తామని తెలిపారు. 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్ తో తీసిన ఫొటోలను కూడా ఎఫ్ టీఎల్ నిర్దారణ కోసం ఉపయోగిస్తున్నామని ఆయన వివరించారు.నాలాలపై కిర్లోస్కర్ కంపెనీ చేసిన స్టడీని పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు 5800 ఫిర్యాదులు హైడ్రాకు అందాయని ఆయన అన్నారు.

6. నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రూ.25 లక్షలు

అస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో ఇండియా క్రికెట్ జట్టు సభ్యుడు నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ సాధించారు. నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడంతో ఆయనను అభినందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖకు చెందిన నితీశ్ కుమార్ రెడ్డిని ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. సోషల్ మీడియాలో సీఎం పోస్టు పెట్టారు. సినీ నటుడు వెంకటేశ్ కూడా నితీశ్ ను అభినందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపు నితీశ్ కు రూ. 25 లక్షల నగదు బహుమతిని అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రకటించారు. మరో వైపు విశాఖపట్టణంలో నితీశ్ రెడ్డి ఇంటి వద్ద అభిమానులు సందడి చేశారు.

Tags:    

Similar News