Delhi: ఢిల్లీ పోలీసుల విచారణలో ఉగ్రవాదుల కుట్ర బట్టబయలు

Delhi: దేశంలో ముంబై తరహా పేలుళ్లకు భారీ స్కెచ్

Update: 2021-09-16 14:59 GMT

ఢిల్లీ పోలీసుల విచారణలో భారీ ఉగ్ర కుట్ర బట్టబయలు (ఫైల్ ఇమేజ్)

Delhi: ఢిల్లీ పోలీసుల విచారణలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల భయంకర కుట్రలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పండగల సీజన్ లో దేశ వ్యాప్తంగా ముంబై తరహా పేలుళ్లకోసం భారీ స్కెచ్ రచించినట్లు తాజా విచారణ లో బయటపడింది. దీనికోసం కొన్ని ప్రాంతాలను కూడా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో కీలక కూడళ్లలో ఉన్న రైళ్లు, బ్రిడ్జిలను పేల్చేయాలని పథకం పన్నినట్లు వీరంతా పాకిస్థాన్ లో గ్వదార్ లో శిక్షణ తీసుకున్నట్లు, వీరికి సహకరించేందుకు కొందరు స్లీపర్ సెల్స్ ఇప్పటికే రంగంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి 1.5 కేజీల ఆర్డీఎక్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్లాన్ కు సంబంధించి మరిన్ని అరెస్టులు జరిగే ఆస్కారముంది. ఢిల్లీ పోలీసులు విచారిస్తున్న ఉగ్రవాదుల్లో ఇద్దరు పాక్ ఐఎస్ ఐ శిక్షణ పొందినట్లు సమాచారం.

Tags:    

Similar News