జమ్మూ కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత
జమ్మూ కాశ్మీర్‌లో లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతూనే ఉంది. తాజాగా షోపియన్‌లోని మునాంద్ ప్రాంతంలో భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్ చేశాయి.
జమ్మూ కాశ్మీర్ లో లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతూనే ఉంది. తాజాగా షోపియన్‌లోని మునాంద్ ప్రాంతంలో భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్ చేశాయి. మరో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడే దాక్కున్నట్లు సమాచారంతో.. భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. రెండు రోజుల క్రితం షోపియన్‌లోని తుర్క్వాంగం గ్రామంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
మరోవైపు, అవంతిపోరాలో కూడా గురువారం ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి . ఒక ఉగ్రవాది ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకునే ప్లాన్ లో మసీదులోకి ప్రవేశించాడు. దాంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా దళాలు రావడంతో
ముందుగా ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నారని జమ్మూ కాశ్మీర్ డిజిపి దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ఆ ఇంటి దగ్గర ఒక మసీదు కూడా ఉంది. అనంతరం ఓ ఉగ్రవాది మసీదులోకి వెళ్లినట్టు సమాచారం అందుకున్నారు.. ఈ క్రమంలో ఆ ఉగ్రవాది కాల్పులు జరపడం ప్రారంభించాడు.. అంతేకాదు గ్రనేడ్ కూడా విసరడంతో.. దాంతో ఇది ఎన్‌కౌంటర్ కు దారితీసింది. ఆ ప్రాంతంలో మరికొంతమంది దాక్కున్నారన్న సమాచారం ఆపరేషన్ ను ఇంకా కొనసాగిస్తున్నారు.
ఇదిలావుంటే దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ లో ఒక ఉగ్రవాదిని అనంతనాగ్ సెక్యూరిటీ దళాలు అరెస్టు చేశాయి. అతని వద్ద ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నాయి. పట్టుబడిన ఉగ్రవాది కుల్గాం రెడ్‌వానీకి చెందిన ఇమ్రాన్ దార్ అని తెలుస్తోంది. అతను ఇటీవల ఉగ్రవాద సంస్థలో చేరాడు.