Rajkot Airport: రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన టెర్మినల్‌ పైకప్పు

Rajkot Airport: రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన టెర్మినల్‌ పైకప్పు

Update: 2024-06-29 17:00 GMT

Rajkot Airport: రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన టెర్మినల్‌ పైకప్పు 

Rajkot Airport: భారీ వర్షాలు ఉత్తరాదిలో వణుకుపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్‌పోర్టులపై వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్‌-1 వద్ద పైకప్పు కుప్పకూలిపోయిన ఘటన మరవకముందే గుజరాత్‌‌లోనూ ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లోని ఓ టెర్మినల్‌ పైకప్పు ఉదయం కూలిపోయింది. ప్రస్తుతం గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నారు. దీంతో ఈదురు గాలులకు ప్రయాణికుల పికప్‌, డ్రాప్‌ పాయింట్‌ వద్ద ఉన్న టెర్మినల్‌ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.

Tags:    

Similar News