PV's centenary celebrations in Delhi: ఢిల్లీలో పీవీ స్మారక సభ.. పలు దేశాల ప్రతినిధులకు ఆహ్వానం

PV's centenary celebrations in Delhi: తెలంగాణా ప్రభుత్వం ఏడాది పాటు నిర్వహించేందుకు నిర్ణయించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకల్లో మరో ముందడుగు వేయబోతోంది.

Update: 2020-08-03 06:37 GMT
PV's centenary celebrations in Delhi

PV's centenary celebrations in Delhi: తెలంగాణా ప్రభుత్వం ఏడాది పాటు నిర్వహించేందుకు నిర్ణయించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకల్లో మరో ముందడుగు వేయబోతోంది. ఆయన పదవీ కాలంలో చేసిన ఘనతలను మరోసారి మననం చేసుకునే విధంగా ఢిల్లీలో స్మారక సభను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి పలు దేశాలకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించనున్నారు.

భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు గౌర‌వార్థంగా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఢిల్లీలో నిర్వ‌హించ‌బోతున్న కార్య‌క్ర‌మానికి అమెరికా మాజీ అధ్య‌క్షులు బిల్ క్లింట‌న్, బరాక్ ఒబామాల‌ను ఆహ్వానించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. వారితో పాటు బ్రిటీస్ మాజీ ప్ర‌ధాని జాన్ మేజర్ ను కూడా ఆహ్వానించ‌నుంది.

కోవిడ్ ప‌రిస్థితులు కుదుట ప‌డిన అనంతరం.. మ‌రో నెల లేదా రెండు నెలల వ్య‌వ‌ధిలో ఢిల్లీలోని విజ్ఞాన భ‌వ‌న్ లో పీవీని స్మ‌రించుకునేందుకు ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ కార్య‌క్ర‌మానికి అమెరికా మాజీ అధ్య‌క్షులను ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించాం. ఇందుకు సంబంధించి ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి అని పీవీ శ‌తాబ్ది ఉత్స‌వ క‌మిటీ ఛైర్మ‌న్ కే కేశ‌వరావు తెలిపారు.

పీవీ విదేశాంగ‌మంత్రిగా పనిచేసిన‌ప్పుడు.. ఇత‌ర‌ దేశాల నేత‌ల‌తో, అధ్య‌క్షుల‌తో స‌త్స‌బంధాలు క‌లిగి ఉండేవార‌ని కేశ‌వ‌రావు గుర్తు చేశారు. కాగా ప్ర‌భుత్వం పీవీ న‌ర‌సింహారావు విగ్ర‌హాలను.. యూఎస్, యూకే, న్యూజిల్యాండ్, సౌతాఫ్రికా వంటి దేశాల్లో ప్రతిష్ఠించాల‌ని భావిస్తోంది. ఇందుకు సంబంధించి వివిధ దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు ఇప్ప‌టికే సందేశాలు పంపింది. కాగా పీవీ న‌ర‌సింహారావు జ‌యంతి ఉత్స‌వాల‌ను జూన్ 28 నుంచి ఏడాది పాటు జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. పీవీకి భార‌త్న ఇవ్వాల‌ని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసి పంపాల‌ని కూడా డిసైడయ్యింది.

Tags:    

Similar News