సుప్రీంకోర్టు విచారణలు లైవ్​లో చూడాలా? ఈ లింక్​పై క్లిక్ చేయండి!

Supreme Court Live Streaming: దేశ అ్యతున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం అందుబాటులోకి వచ్చింది.

Update: 2022-09-27 06:08 GMT

సుప్రీంకోర్టు విచారణలు లైవ్​లో చూడాలా? ఈ లింక్​పై క్లిక్ చేయండి!

Supreme Court Live Streaming: దేశ అ్యతున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం అందుబాటులోకి వచ్చింది. ఈ లైవ్ ప్రొసీడింగ్స్‌ను తొలుత యూట్యూబ్‌లో ప్రసారం చేస్తున్నారు. రానున్న రోజుల్లో సుప్రీం సొంత వేదిక ద్వారానే విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సుప్రీంకోర్టులో కేసుల విచారణ లైవ్ స్ట్రీమింగ్‌కు అనుకూలంగా 2018లో నిర్ణయం తీసుకున్నారు. మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ రోజు ఆగస్టు 26న తొలిసారి సుప్రీం విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు.

ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసుల వరకే లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. త్వరలోనే అన్ని ధర్మాసనాల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. https://main.sci.gov.in/display-board లేదా https://webcast.gov.in/scindia/ లో వేర్వేరు ధర్మాసనాల విచారణల ప్రత్యక్ష ప్రసారం లింకులు అందుబాటులో ఉంటాయి. ఈడబ్ల్యూఎస్​ కోటా; దిల్లీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రం, శివసేన వివాదం; ఆల్​ ఇండియా బార్ ఎగ్జామ్ చెల్లుబాటుపై మూడు వేర్వేరు ధర్మాసనాల విచారణల్ని ఇక్కడ చూడొచ్చు.

Tags:    

Similar News