వెబ్ పోర్టల్స్‌పై నియంత్రణ లేదన్న సుప్రీంకోర్టు
* వెబ్ పోర్టల్స్‌పై నియంత్రణ లేదన్న సుప్రీంకోర్టు * దేశంలో ప్రతి విషయాన్ని ఒక కోణంలోనే చూపుతున్నారు: సుప్రీంకోర్టు
Supreme Court: తబ్లీగి జమాత్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంలో సామాజిక మాధ్యమాలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యల చేశారు.. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో వస్తున్న కంటెంట్ పై ఎవరిరీ జవాబుదారీతనం లేకపోకపోవడం బాధాకరమన్నారు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.ఈ దేశంలో ప్రతి విషయాన్ని ఒక మత కోణంలోనే చూపుతున్నారు. ఇది దేశంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వెబ్ పోర్టల్స్‌పై నియంత్రణ లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వారు ఏదైనా ప్రచురించగలరు. ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ చానెల్ ప్రారంభించవచ్చన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కోర్టులకు ఎప్పుడూ స్పందించవు.. వాటికి జవాబుదారీతనం లేదు.. వారు శక్తివంతమైన వ్యక్తులకు మాత్రమే స్పందిస్తారు తప్ప.. సాధారణ వ్యక్తులకు, సంస్థలకు సమాధానం ఇవ్వరు.. వెబ్ పోర్టల్స్, యూట్యూబ్ చానళ్లలో వస్తున్న వీడియోలు, వాస్తవ విరుద్ధమైన వార్తల పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని పరిష్కరించడానికి ఏదైనా మెకానిజం ఉందా అని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఎలక్ట్రానిక్, వార్తాపత్రికలకు ఉన్న తరహా వ్యవస్థ ఏదైనా ఉంటే చెప్పాలని ధర్మాసనం సూచించింది. ఎలాంటి వ్యవస్థ లేకపోతే నియంత్రణకు ఏదో ఒకటి చేయాలన్నారు.