తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

*2014 ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో నిబంధనలు అమలు చేయాలని పిటిషన్

Update: 2022-09-19 11:44 GMT

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

Supreme Court: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుదలపై విచారించాలని సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అసెంబ్లీ సీట్ల పెంపుదల ఆవశ్యకతపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2014 ఏపీ పునర్వవస్థీకరణ చట్టంలో నిబంధనలు అమలు చేయాలని పిటిషన్లో కోరారు. 119 అసెంబ్లీ సీట్లున్న తెలంగాణలో 153 సీట్లకు పెంపుదల చేయాలని, 175 అసెంబ్లీ సీట్లున్న ఆంధ్రప్రదేశ్‌లో 225 స్థానాలకు పెంచాలని ప్రొఫెసర్ పురుషోత్తం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిటిషన్ దారు ప్రదివాదులుగా పేర్కొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలతోపాటు ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.

Tags:    

Similar News