వలసకార్మికులపై సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు

వలసకార్మికులపై సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. రైలు పట్టాలపై నిద్రించే వారిని ఎలా అడ్డుకోగలమని వ్యాఖ్యానించింది.

Update: 2020-05-15 08:52 GMT

వలసకార్మికులపై సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. రైలు పట్టాలపై నిద్రించే వారిని ఎలా అడ్డుకోగలమని వ్యాఖ్యానించింది. వలసకార్మికులు నడవకుండా వారిని ఎలా ఆపుతామని ప్రశ్నించింది. వలసకార్మికులకు ఉచిత రవాణా, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటీషన్ ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. సొంత ప్రాంతాలకు వెళ్లే వారిని ఎవరైనా ఆపగలరా? అని ప్రశ్నించింది సుప్రీంకోర్ట్.

ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించేంత వరకూ ఓపికగా ఎదురు చూడకుండా నడక దారి పట్టారని కేందం సుప్రీం కోర్టుకు తెలిపింది. వలసకార్మికులకు కాస్త సహనం అవసరమని అన్నారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. వారిలో ఎవరు నడిచివెళుతున్నారో.. ఎవరు నడవకుండా సొంత ప్రాంతాలకు వెళుతున్నారో తెలుసుకోవడం కోర్టు వల్ల కాదని అంది. వలసకార్మికుల పైనుంచి రైలు దూసుకెళ్లిన పిటీషన్ ను కూడా సుప్రీం కోర్ట్ తిరస్కరించింది.

Tags:    

Similar News