Supreme Court: ముంబైని చూసి నేర్చుకోండి- సుప్రీం
Supreme Court: కోవిడ్-19 విలయాన్ని ఎదుర్కొనడంలో ముంబై నగర పాలక సంస్థ అనుసరించిన విధానాలను సుప్రీంకోర్టు ప్రశంసించింది.
Supreme Court: కోవిడ్-19 విలయాన్ని ఎదుర్కొనడంలో ముంబై నగర పాలక సంస్థ అనుసరించిన విధానాలను సుప్రీంకోర్టు ప్రశంసించింది. ముంబైలో అమలు చేసిన పద్ధతులను ఢిల్లీలో ప్రయత్నించి చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కరోనా కట్టడికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ధిక్కరణ ఉత్తర్వులపై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై బుధవారం విచారణ చేపట్టింది. గత మూడు రోజులుగా దేశ రాజధానికి కేంద్రం ఎంత ఆక్సిజన్‌ను సరఫరా చేసిందని కోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అధికారులను జైలులో పెట్టడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం రెండు కోవిడ్ కట్టడికి కలసికట్టుగా కృషి చేయాలని సూచించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలను సుప్రీం నిలిపివేసింది. ఢిల్లీకి ఇవ్వాల్సిన కోటా మేరకు రోజుకు 700 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని కేంద్రానికి ఆదేశించింది.