S.Jaishankar: బంగ్లాదేశ్ పరిస్థితిపై రాజ్యసభలో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన

S.Jaishankar: బంగ్లాదేశ్ పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తుంది

Update: 2024-08-06 11:15 GMT

S. Jaishankar: బంగ్లాదేశ్ పరిస్థితిపై రాజ్యసభలో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన 

S.Jaishankar: బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో లెవనెత్తారు. ఇప్పటివరకూ భారత్, బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు కొనసాగాయని.. బంగ్లాదేశ్ పరిస్థితులపై భారత్ నిశితంగా పరిశీలిస్తుందని.. వివరించారు. చాలా తక్కువ సమయంలోనే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి.. భారతదేశానికి రావడానికి అనుమతిని అభ్యర్థించిందని తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఇంకా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని.. హిందువుల దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయన్నారు. బంగ్లాదేశ్‌లో ఉన్న 19వేల మంది భారతీయల్లో.. సగానికిపైగా స్టూడెంట్స్ ఉన్నారని.. వారందరూ గత నెలలోనే భారత్‌కు తిరిగి వచ్చేసినట్టు తెలిపారు.

Tags:    

Similar News