New Rules: వాహనదారులకు అలర్ట్.. టోల్ వసూళ్లపై కేంద్రం కీలక నిర్ణయం!
New Rules: హైవేలపై టోల్ ఫీజు వసూలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
New Rules: హైవేలపై టోల్ ఫీజు వసూలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ వసూళ్ల ప్రక్రియ మరింత సమర్ధంగా ఉండే విధంగా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో, వాహనదారులకు కొంత మేరకు ఉపశమనం కలుగనుంది. నూతన విధానానికి అనుగుణంగా వాహనం హైవేలపై ఎంత సమయం, ఎంత దూరం ప్రయాణించిందనే దాని ఆధారంగా టోల్ వసూలు చేస్తారు.
కాగా 60 కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రతి కలెక్షన్ పాయింట్స్ వద్ద టోల్ ట్యాక్స్ వసూలు చేయబోరని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ దూరంలో ఉండే ఇతర కలెక్షన్ పాయింట్స్‌ను మూసివేస్తామని మంత్రి పేర్కొన్నారు.