Sonu Sood: 22 మంది ప్రాణాలు కాపాడిన సోనూసూద్ టీమ్‌..

Sonu Sood: సోనూసూద్‌. రీల్ లైఫ్‌లో విలనే. కానీ లాక్‌డౌన్ సమయంలో రియల్‌ హీరోగా మారిపోయాడు.

Update: 2021-05-05 12:28 GMT

Sonu Sood: 22 మంది ప్రాణాలు కాపాడిన సోనూసూద్ టీమ్‌..

Sonu Sood: సోనూసూద్‌. రీల్ లైఫ్‌లో విలనే. కానీ లాక్‌డౌన్ సమయంలో రియల్‌ హీరోగా మారిపోయాడు. వేల మంది వలస కార్మికులను స్వస్థలాలకు పంపించి రియల్ లైఫ్‌లో సుప్రీం హీరో అయ్యారు. కరోనా కారణంగా దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్నఇబ్బందులును పరిష్కరిస్తూ వారిపాలిట ఆపద్భాంధవుడిగా మారారు సోనూసూద్‌. ఇప్పుడు మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు సోనూసూద్ బృందం సభ్యులు. కర్ణాటకలోని సోనూసూద్‌ బృందం సకాలంలో స్పందించి ప్రాణాపాయస్థితిలో ఉన్న 22 మంది రోగుల ప్రాణాలను రక్షించింది.

బెంగళూరులోని అరక్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్లు కావాలంటూ సత్యనారాయణన్‌ అనే ఓ పోలీసు అధికారి కర్ణాటకలోని సోనూసూద్‌ బృందానికి అత్యవసర సందేశం పంపారు. ఆ ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక అప్పటికే ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోగా మరో 20 నుంచి 22 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అత్యవసర సందేశం అందుకున్న వెంటనే స్పందించిన సోనూసూద్‌ బృందం కొన్ని నిమిషాల్లోనే అరక్‌ హాస్పిటల్‌కి 16 ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచింది.

వాలంటీర్ల కృషిని సోనూసూద్‌ ప్రశంసించారు. ఇది టీంవర్క్‌కు నిదర్శనం. ఇలాగే పని చేస్తూ దేశ ప్రజలందరికి అండగా ఉంటాం. ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణన్‌ నుంచి సందేశం రాగానే పరిస్థితిని తెలుసుకుని కొన్ని నిమిషాల్లోనే ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచాం. ఇందులో ఏ మాత్రం ఆలస్యం జరిగినా వారి ప్రాణాలో పోయేవి. వారిని కాపాడిన అందరికీ ధన్యవాదాలు అని సోనూసూద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే ఇంత మంది ప్రాణాలు కాపాడినందుకు ఆస్పత్రి వైద్యులు, రోగుల కుటుంబాలు సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News