Amazon Prime Day Sale Postponed: కరోనా దెబ్బకు అమెజాన్ అదిరిపోయింది.
Amazon Prime Day Sale Postponed: ఆన్ లైన్ మార్కెటింగ్ కరోనా ఎఫెక్ట్ పడింది.
Amazon Prime Day Sale Postponed: కరోనా దెబ్బకు షాపింగ్ మాల్స్ మాత్రమే కాదు.. ఆన్ లైన్ మార్కెటింగ్ కూడా దెబ్బ తినే పరిస్ధితి వచ్చింది. కరోనా విలయతాండవం చేస్తుండటంతో.. ప్రతి ఒక్కరూ బయట తిరగడానికి భయపడుతున్నారు. ఆన్ లైన్ బుకింగ్స్ డెలివరీ ఇచ్చేవారు మరింత భయపడుతున్నారు. ఇప్పటికే వారిలో చాలామందికి కరోనా సోకిందని తెలుస్తోంది. అందుకే అమెజాన్ సైతం తన నిర్ణయాన్ని మార్చుకుంది.
బిగ్ ప్రైమ్ డే అనౌన్స్ చేసి.. ఆఫర్ల మీద ఆఫర్లు కుమ్మరించే అమెజాన్.. ఆ బిగ్ ప్రైమ్ డే త్వరలో అని అనౌన్స్ చేసింది. మే నెలలోనే పెట్టాలనుకుంది. కాని ప్రస్తుత పరిస్ధితి చూసి.. ఒకవైపు ఆర్ధికంగా ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చేవారు తగ్గడంతో పాటు.. బుక్ చేసుకున్నవారికి డెలివరీ ఇచ్చే మ్యాన్ పవర్ కూడా మరో ప్రాబ్లెమ్ గా మారడంతో..ఆ ప్రైమ్ డే ను అమెజాన్ వాయిదా వేసుకుంది. ఆగస్టు దాకా మళ్లీ అనౌన్స్ చేయకూడదని డిసైడ్ అయింది. అలా కరోనా ఆన్ లైన్ బిజినెస్ మీద కూడా దెబ్బ వేసింది. కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వ్యాపార రంగాలపై దీని ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ప్రజలు కూడా విలాస వస్తువలుపై కాకుండా కేవలం ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.