మురుగ మఠం పీఠాధిపతి శివమూర్తి అరెస్ట్

Shivamurthy Murugha Sharanaru: మైనర్లపై లైంగిక వేధింపులు కేసులో అరెస్ట్

Update: 2022-09-02 05:15 GMT

మురుగ మఠం పీఠాధిపతి శివమూర్తి అరెస్ట్

Shivamurthy Murugha Sharanaru: కర్ణాటకలోని మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరును పోలీసులు అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఆరు రోజుల తరువాత ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అరెస్టు చేసినట్లు కర్ణాటక పోలీసులు వెల్లడించారు. అనంతరం వైద్యపరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత జిల్లా సెషన్స్​ జడ్జి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో చిత్రదుర్గ పోలీస్​స్టేషన్​కు శివమూర్తి మురుగను తరలించారు.

కర్ణాటక చెందిన ఇద్దరు బాలికలు మైసూరులోని ఒక స్వచ్ఛంద సంస్థ వద్దకు వెళ్లి తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి అక్కడి అధికారులకు వివరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మురుగ మఠాధిపతిని అరెస్ట్​ చేశారు. బాధితుల్లో ఒకరు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం వల్ల మురుగ మఠాధిపతిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అరెస్టు నేపథ్యంలో చిత్రదుర్గలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు కుట్రలో భాగమని, తాను చట్టానికి కట్టుబడి ఉన్నానని, విచారణకు సహకరిస్తానని మురుగ మఠాధిపతి తెలిపారు.

Full View


Tags:    

Similar News