Congress: ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం
Congress:పీసీసీ చీఫ్ షర్మిల నేతృత్వంలో అనంతపురంలో సభ
Congress: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నేడు అనంతపురం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు న్యాయ సాధన సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నేతృత్వంలో నిర్వహించే సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ సభావేదిక నుంచే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన కొన్ని పథకాలను ప్రకటించనున్నట్లు ఆ పార్టీ ముఖ్యులు తెలిపారు.