విషమంగా అహ్మద్ పటేల్ ఆరోగ్యం!
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొన్ని రోజుల క్రితం కొవిడ్ బారిన పడ్డ అహ్మద్ పటేల్.. ప్రస్తుతం గుర్గావ్‌లోని ప్రైవేటు ఆసుపత్రి ఐసీయులో చికిత్స పొందుతున్నారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొన్ని రోజుల క్రితం కొవిడ్ బారిన పడ్డ అహ్మద్ పటేల్.. ప్రస్తుతం గుర్గావ్‌లోని ప్రైవేటు ఆసుపత్రి ఐసీయులో చికిత్స పొందుతున్నారు. అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా అహ్మద్ పటేల్ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కు గురైనట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అహ్మద్ పటేల్ కండిషన్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది.పటేల్ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. అటు అహ్మద్ పటేల్ ఆరోగ్యం పట్ల అయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. " నాన్నగారి పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. ఆయన త్వరగా కోలుకునేలా అంతా ప్రార్ధించాలని కోరుతున్నాను" అని పేర్కొన్నారు.