కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు కరోనా!
Ahmed Patel Tests Positive : కరోనా ఎవరిని వదలడం లేదు..సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి సోకుతుంది. అయితే కరోనా వైరస్ బారినపడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య మాత్రంపెరుగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌కు కరోనా సోకింది.
Ahmed Patel Tests Positive : కరోనా ఎవరిని వదలడం లేదు..సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి సోకుతుంది. అయితే కరోనా వైరస్ బారినపడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య మాత్రంపెరుగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో స్వయంగా వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు ఢిల్లీలోని తన నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనని కలిసినవాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇక అటు ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నేతలు కరోనా బారిన పడ్డారు. అభిషేక్ సింఘ్వి మను, తరుణ గొగోయ్, డీకే శివకుమార్, సిద్ధరామయ్య తదితరులకి కరోనా సోకగా వారు కరోనా నుంచి బయరపడ్డారు. అటు కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ మొదలగు వారికి కూడా కరోనా సోకింది. తాజాగా దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కరోనాబారిన పడిన సంగతి తెలిసిందే..
ఇదిలావుండగా, దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,821 కరోనావైరస్ కేసులను నమోదు అయ్యాయి.. తాజాగా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 63,12,584 కు చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ ని విడుదల చేసింది. అటు గడిచిన 24 గంటల్లో వైరస్ కారణంగా 1,181 మంది చనిపోయారు. దీనితో మరణించిన వారి సంఖ్య 98,678 కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 9,40,705 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు మొత్తం 52,73,201 మంది కరోనా నుంచి కోలుకున్నారు.