Terrorist Encounter in J&K: జమ్మూకాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం.. అందులో ఒకరు..
Terrorist Encounter in Jammu & Kashmir: గత కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్‌లో తుపాకీ మోత మోగుతూనే ఉంది. భద్రతాదళాలు ఉగ్రవాదులను ఏరివేస్తున్నాయి.
Terrorist Encounter in Jammu & Kashmir: గత కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్ లో తుపాకీ మోత మోగుతూనే ఉంది. భద్రతాదళాలు ఉగ్రవాదులను ఏరివేస్తున్నాయి. తాజాగా పుల్వామా జిల్లాలోని ట్రాల్ ఉల్లార్ గ్రామంలో జరిగిన తుపాకీ పోరులో భద్రతా దళాలు శుక్రవారం (జూన్ 26) ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వారి వద్ద నుంచి ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హతమైన ముగ్గురు ఉగ్రవాదులు కొంతకాలంగా లోయలో నివసించేవారని నివేదికలు పేర్కొన్నాయి. దీనితో, భద్రతా దళాలు భారీగా ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరిపింది. గురువారం సాయంత్రం నుంచి ఈ ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 15 గంటల పోరాటం అనంతరం ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేశారు.
హతమైన ఉగ్రవాదులను మహ్మద్ ఖాసిమ్ షా అలియాస్ జుగ్ను, బాసిత్ అహ్మద్ పారే , హరిస్ మంజూర్ భట్ గా గుర్తించారు. బిటెక్ చదివిన ఖాసిమ్, మిలిటెన్సీలో 2017 మార్చిలో ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలను గమనించి ఆకర్షితుడైనట్టు వర్గాలు గుర్తించాయి. కాగా ఈ నెలలో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన 15 ఎన్‌కౌంటర్లలో ఇప్పటివరకు 44 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఉగ్రవాదుల సహాయకులను బంధించే ప్రక్రియ కూడా జరుగుతోంది. బుద్గామ్లోని నార్బల్ ప్రాంతంలో బుధవారం 5 మంది లష్కర్-ఎ-తైబా సానుభూతిపరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.