మసీదులో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదుల ఖతం
జమ్మూ కాశ్మీర్‌లోని అవంతిపోరలోని మాగే ప్రాంతంలో శుక్రవారం ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది.
జమ్మూ కాశ్మీర్‌లోని అవంతిపోరలోని మాగే ప్రాంతంలో శుక్రవారం ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. తెల్లవారుజామున ఇక్కడ మసీదులో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. వాస్తవానికి, గురువారమే ఒక ఎన్‌కౌంటర్ జరిగింది, ఇందులో ఒక ఉగ్రవాది మృతి చెందగా, ఈ ఇద్దరు ఉగ్రవాదులు మసీదులో దాక్కున్నారు. దాంతో వారికోసం భద్రతా దళం రాత్రంతా పహారా కాసింది. శుక్రవారం ఉదయం ఈ ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేసినట్టు జమ్మూ కాశ్మీర్ డిజిపి దిల్‌బాగ్ సింగ్ ధృవీకరించారు. ఈ ఏరియాలో ముగ్గురు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది.
ముందుగా ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నారని జమ్మూ కాశ్మీర్ డిజిపి దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ఆ ఇంటి దగ్గర ఒక మసీదు కూడా ఉంది. అనంతరం వారు మసీదులోకి వెళ్లినట్టు తెలుసుకున్నారు.. అయితే ఈ ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దాంతో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. గురువారం ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చగా, ఇద్దరు ఉగ్రవాదులు పారిపోయి స్థానిక జామా మసీదులోకి ప్రవేశించారు. ఈ మసీదు యొక్క ప్రాంగణం చాలా పెద్దది కావడంతో భద్రతా దళాలు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆ ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేశారు.