Supreme Court: ముస్లిం మహిళలకు భరణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court: ముస్లిం మహిళలకు భరణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Update: 2024-07-10 07:06 GMT

Supreme Court: ముస్లిం మహిళలకు భరణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court: ముస్లిం మహిళలకు భరణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ సెక్షన్‌ 125 CrPC ప్రకారం.. భరణం క్లెయిమ్‌ చేయవచ్చన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. తెలంగాణకు చెందిన మొహ్మద్‌ అబ్దుల్‌ సమద్‌ కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. తన భార్యకు 10వేల మధ్యంతర భరణం చెల్లించాలన్న.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లారు అబ్దుల్‌ సమద్‌. విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది. భరణానికి సంబంధించిన హక్కును కల్పించే ఆ సెక్షన్‌ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.

Tags:    

Similar News