SBI App Net Banking: 14 గంటల పాటు నిలిచిపోనున్న ఎస్బీఐ సేవలు
SBI App Net Banking: మే 23న 00.01 నుంచి 14.00 గంటల వరకు నెఫ్ట్ సర్వీసులు అందుబాటులో ఉండవని ఎస్ బీఐ తెలిపింది.
SBI App Net Banking: ఎస్బీఐ తన కస్టమర్లకు ఈ రోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు తమ సేవలు అందవని ముందే మెసేజ్ పంపింది. మెయిన్ టెయినెన్స్ కోసమే ఈ నిర్ణయమని.. కస్టమర్లు గమనించాలని కోరింది. ఈ రోజు బిజినెస్ హవర్స్ అయిన వెంటనే సేవలు నిలిచిపోతాయని తెలిపింది. బ్యాంక్ నెఫ్ట్ సర్వీసులు కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండవని తెలిపింది. ఈరోజు బిజినెస్ క్లోజింగ్ అవర్స్ తర్వాత నెఫ్ట్ సేవలు కస్టమర్లకు అందుబాటులో ఉండవు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్ వంటి వాటిల్లో నెఫ్ట్ సర్వీసులు పొందలేరని బ్యాంక్ తెలిపింది. మే 23న 00.01 నుంచి 14.00 గంటల వరకు నెఫ్ట్ సర్వీసులు అందుబాటులో ఉండవు. అయితే ఆర్‌టీజీఎస్ సర్వీసులు మాత్రం అందుబాటులోనే ఉంటాయని బ్యాంక్ తెలిపింది.
అందువల్ల బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెఫ్ట్ లావాదేవీలు నిర్వహించే వారు బ్యాంక్ అలర్ట్‌ను పరిగణలోకి తీసుకొని, తదనుగుణంగావారి లావాదేవీలను నిర్వహించుకోవడం ఉత్తమం. కాగా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించింది.