Cyclone Mocha: మోకా తుఫాను సుడులు ఎలా ఉన్నాయో మీరే చూడండి.. ఒళ్లు జలదరించేలా ఉన్న సైక్లోన్ ఐ..
Cyclone Mocha: మోకా తుఫాను సుడులు ఎలా ఉన్నాయో మీరే చూడండి.. ఒళ్లు జలదరించేలా ఉన్న సైక్లోన్ ఐ..
Cyclone Mocha: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం..ఆ తర్వాత వాయుగుండంగా మారి తర్వాత ఉత్తర వాయవ్యంగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి తుఫాన్ గా మారింది. దీనికి మోకా అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ మోకా తుఫాను ఉత్తర దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ తుఫానును అంతరిక్షం నుంచి భారత వాతావరణ ఉపగ్రహం చిత్రీకరించింది.
ఇందులో సైక్లోన్ ఐ స్పష్టంగా ఏర్పడిన వైనాన్ని మనం చూడవచ్చు. ఈ తుఫాన్ మే 14 మధ్యాహ్నం నాటికి బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య తీరం దాటనుందని ఐఎండీ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు...ఏపీ, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ తుఫాను తీరం చేరితే బంగ్లాదేశ్, మయన్మార్ లో విలయం తప్పదని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.