కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు.. ఎమ్మెల్యేల మధ్య తోపులాట..
Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో శుక్రవారం కూడా గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి.
Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో శుక్రవారం కూడా గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. 370 ఆర్టికల్ ను పునరుద్దరించాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్, ఇతర ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని బీజేపీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నవంబర్ 7న నేషనల్ కాన్ఫరెన్స్, బీజేపీ సభ్యులు బాహాబాహీకి దిగారు. దీంతో స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేశారు.
శుక్రవారం కూడా పీడీపీ ఎమ్మెల్యే 370 ఆర్టికల్ ను పునరుద్దరించాలంటూ బ్యానర్ ప్రదర్శించారు. ఇది ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బ్యానర్ ను ప్రదర్శించిన పీడీపీ ఎమ్మెల్యేను స్పీకర్ ఆదేశం మేరకు మార్షల్స్ బయటకు పంపారు.
370 ఆర్టికల్ రద్దు
2019 ఆగస్టు 5న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా రద్దు అయింది. రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా దిల్లీ, లడఖ్ ను శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్టికల్ 370 విషయంలో రాజకీయ పక్షాలు ఈ అంశాన్ని ప్రచారం చేశాయి. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విషయమై నేషనల్ కాన్ఫరెన్స్ సహా ఈ డిమాండ్ ను సమర్ధిసున్న పార్టీలకు,బీజేపీకి మధ్య గొడవలు జరుగుతున్నాయి.