Kolkata Doctor Murder Case: వైద్యురాలిపై హత్యాచార ఘటన.. సీబీఐ కస్టడీకి ఆర్‌జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్‌

Kolkata Doctor Murder Case: సందీప్‌ ఘోష్‌‌కు 8రోజుల కస్టడీ

Update: 2024-09-03 13:15 GMT

Kolkata Doctor Murder Case: వైద్యురాలిపై హత్యాచార ఘటన.. సీబీఐ కస్టడీకి ఆర్‌జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్‌

Kolkata Doctor Murder Case: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన సంచలనం సృష్టిస్తోంది. కాలేజీలో అవకతవకలకు పాల్పడిన కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ‌ను ఇప్పటీకే సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయనను తాజాగా కోర్టు 8రోజుల కస్టడీకి అప్పగించింది. అనాథ శవాలను అమ్ముకోవడంతో పాటు ఆస్పత్రి టెండర్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఘోష్‌పై ఆరోపణలున్నాయి. ఆ వ్యవహారాలు తెలిసినందునే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

Tags:    

Similar News