Supreme Court: పరీక్ష పవిత్రతకు దెబ్బతింటేనే రీటెస్టుకు ఆదేశిస్తాం

Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ యూజీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

Update: 2024-07-18 10:01 GMT

Supreme Court: పరీక్ష పవిత్రతకు దెబ్బతింటేనే రీటెస్టుకు ఆదేశిస్తాం

Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ యూజీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని కోర్టు మరోసారి స్పష్టం చేసింది. సామాజిక పరిణామాల దృష్ట్యా నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు తాము ప్రాముఖ్యత ఇస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంలో కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందోనని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారని సీజేఐ అన్నారు. అలాగే పిటిషనర్లకు వచ్చిన కనీస మార్కులపై సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 131 మంది విద్యార్థులు మాత్రమే రీటెస్ట్‌ కోరుతున్నారని సొలిసిటర్ జనరల్‌ వెల్లడించారు.

Tags:    

Similar News