రాందేవ్ బాబాకు మళ్లీ సుప్రీం అక్షింతలు

పతంజలి ఆయూర్వేద్ తీరును తప్పి పట్టిన కోర్టు

Update: 2024-04-23 16:03 GMT

రాందేవ్ బాబాకు మళ్లీ సుప్రీం అక్షింతలు 

తప్పుదోవ పట్టించే ప్రకటనలు.. కోర్టు ధిక్కరణ పరిణామాల వ్యవహారం పతంజలి ఆయుర్వేద్ తీరును తప్పుబట్టడంలో దేశ సర్వోన్నత న్యాయ స్థానం ఏమాత్రం ఉపేక్షించడం లేదు. పతంజలి కంపెనీ నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణలపై సుప్రీంకోర్టు మండిపడింది. పతంజలి ఉత్పత్తుల కోసం ఇచ్చిన ప్రకటనల మాదిరిగానే.. క్షమాపణలకు సంబంధించిన ప్రకటనల సైజులోనే ఉన్నాయా అంటూ ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. అయితే క్షమాపణల కోసం పతంజలి లక్షలు వెచ్చించిందని.. సుమారు పది లక్షల ఖర్చుతో 67 పత్రికల్లో ప్రకటన ఇచ్చిందని పతంజలి తరపు న్యాయవాది రోహిత్గీ కోర్టుకు తెలిపారు. మరో వైపు పత్రికల్లో క్షమాపణలు మరింత పెద్ద సైజులో ప్రకటనలు ఇస్తామని రాందేవ్ బాబా చెప్పడంతో ఈ కేసు విచారణ మరో వారం రోజులకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

Tags:    

Similar News